: రాష్ట్రపతి ముందుకు క్యాంపాకోలా లొల్లి
ముంబై క్యాంపాకోలా సొసైటీ తగవు రాష్ట్రపతి ముందుకు వెళ్లింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో క్యాంపాకోలా గృహాలను కూల్చేసేందుకు వరుసగా మూడో రోజు వెళ్లిన బృహన్ముంబై మున్సిపల్ కార్పోరెషన్ అధికారులను కాలనీ వాసులు గేటు వద్ద అడ్డుకున్నారు. క్యాంపాకోలా గృహ సముదాయం గేట్లు కూల్చేసేందుకు అధికారులు రెండు జేసీబీలు సిద్ధంగా ఉంచారు. కూల్చివేత ప్రక్రియ మొత్తం సుప్రీంకోర్టుకు చూపించేందుకు వీడియో తీసే ఏర్పాట్లు కూడా చేశారు.
క్యాంపాకోలా కాలనీ మహిళలు ముందువరుసలో నిలబడి అధికారులు, జేసీబీలను అడ్డుకున్నారు. అయినా అధికారులు ఆగకపోవడంతో కాలనీ వాసులంతా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి క్షమాభిక్ష దరఖాస్తు చేశారు. సెక్షన్ 143(1) ప్రకారం సుప్రీంకోర్టు సలహా తీసుకోవాలని దరఖాస్తులో పేర్కొన్నారు.