: ఈ నెల 17న మార్గరెట్ థాచర్ అంత్యక్రియలు
బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ అంత్యక్రియలు ఈ నెల 17న జరగనున్నాయి. లండన్ లోని సెయింట్ పాల్ చర్చిలో జరగనున్న కార్యక్రమానికి రెండో ఎలిజబెత్ రాణి, ఇతర రాచరిక ప్రముఖులు హాజరవుతారని ప్రధాని డేవిడ్ కామెరాన్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. కొన్నాళ్ల పాటు ఇమ్నిషియాతో బాధపడిన 85 సంవత్సరాల థాచర్, రెండు రోజుల కిందట తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.