: మరో పట్టణం స్వాధీనం చేసుకున్న ఇరాకీ తీవ్రవాదులు
ఇరాక్ లో సున్నీ మిలిటెంట్లు పేట్రేగిపోయారు. తాజాగా ఇరాక్ పశ్చిమ ప్రాంతంలోని అన్బర్ ప్రావిన్స్ లో రుత్బా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. అన్బర్ ప్రావిన్స్ లో మిలిటెంట్లు పట్టు సాధించిన పట్టణాల్లో రుత్బా నాలుగవది. ఇంతక్రితం వారు కయీం, రవా, అనా పట్టణాలను దిగ్బంధించారు.