: పీపీఏ రద్దుపై కేంద్రాన్ని సంప్రదిస్తాం: దత్తన్న
విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాన్ని రద్దు చేయడం అప్రజాస్వామికమని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు అలాంటి నిర్ణయం తీసుకుంటాడని ఊహించలేదని అన్నారు. దీనిపై జోక్యం చేసుకోవాల్సిందిగా కేంద్రాన్ని కోరతామని ఆయన తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో చర్చించి కేంద్రం తెలంగాణలో విద్యుత్ లోటు లేకుండా చేస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.