: ఆర్టీపీపీకి బొగ్గు కొరత... నిలిచిన విద్యుదుత్పత్తి
కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ)కి బొగ్గు కొరత ఏర్పడింది. దీంతో, 2,3 యూనిట్లలో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఈ పరిణామంతో 420 మెగావాట్ల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. బొగ్గు కొరత కారణంగా మరో యూనిట్ కూడా నిలిచిపోయే ప్రమాదంలో పడింది.