: 25 కిలోమీటర్ల రైల్వే లైన్ కి రూ.1050 కోట్లు ఖర్చు


1050 కోట్ల రూపాయలతో జమ్మూకాశ్మీర్ లోని ఉధమ్ పూర్ నుంచి కాత్రా వరకు నిర్మించిన రైలు మార్గంపై రైలు పరుగులు పెట్టడానికి సిద్ధమవుతోంది. వైష్ణోదేవి ఆలయం బేస్ క్యాంపు ప్రాంతమైన కాత్రాకు ఉధమ్ పూర్ 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. జనవరిలో మూడు రోజుల పాటు కమిషనరేట్ ఆఫ్ రైల్ సేఫ్టీ అధికారులు ట్రాక్ పరీక్షలు నిర్వహించారు. ఆ సందర్భంగా వారు లేవనెత్తిన పలు సందేహాలను రైల్వే అధికారులు నివృత్తి చేశారు. దాంతో, ఈ మార్గంపై రైలు ప్రయాణించేందుకు పూర్తి అనుమతి లభించింది. ఈ నెలాఖరుకల్లా ప్రధాని మోడీ, రైల్వే మంత్రి సదానందగౌడ దీనిని ప్రారంభించనున్నారు.

  • Loading...

More Telugu News