: రుణమాఫీపై సహచరులతో బాబు చర్చ
ఆంధ్రప్రదేశ్ లో రైతు రుణమాఫీపై కోటయ్య కమిటీ నివేదిక సమర్పించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రులు యనమల, ప్రత్తిపాటి, రావెల, బొజ్జల, ఢిల్లీలో టీడీపీ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావుతో చర్చించేందుకు సమావేశమయ్యారు. రుణమాఫీ కారణంగా ప్రభుత్వంపై పడే భారం, కమిటీ సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలపై ఆయన సహచరులతో చర్చిస్తున్నారు. రుణమాఫీపై సాయంత్రానికి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.