: అసోంలో సీఎం మార్పు దిశగా కాంగ్రెస్ పావులు


అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ని మార్చే దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం పావులు కదుపుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాజయం తరువాత కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో నాయకత్వమార్పుపై అధిష్ఠానం దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో రైల్వే ఛార్జీల పెంపుపై చర్చ పేరిట నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనేందుకు లోక్ సభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే రేపు గౌహతి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా నాయకత్వ మార్పుపై ఎమ్మెల్యేలతో చర్చించనున్నారని సమాచారం.

పద్నాలుగేళ్లు అసోం ముఖ్యమంత్రిగా ఉన్న తరుణ్ గొగోయ్ గత రెండేళ్లుగా అసమ్మతి ఎదుర్కొంటున్నారు. అసోం విద్యాశాఖ మంత్రి హిమంత బిశ్వశర్మ అసమ్మతి వాదులకు నాయకత్వం వహిస్తున్నారు. కాగా తనతో 45 మంది ఎమ్మెల్యేలు కలసి వస్తారని ఆయన చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకత్వ మార్పుపై దృష్టి సారించిందని పార్టీలో చెప్పుకుంటున్నారు.

  • Loading...

More Telugu News