: 'నమో' పేరుతో యాంటీవైరస్ సాఫ్ట్ వేర్
ఇటీవల ఎన్నికల వేళ 'నమో' పేరు బాగా పాప్యులర్ అయిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ పేరుకు సంక్షిప్త నామమే నమో. ఇప్పుడదే పేరుతో ఓ యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ రూపొందించారు. ఉచితంగా లభించే తమ సాఫ్ట్ వేర్ సాయంతో మాల్వేర్, వైరస్ లను సమర్థంగా ఎదుర్కోవచ్చని దేశీయ ఐటీ సంస్థ 'ఇన్నోవేజన్' తెలిపింది. రియల్ టైమ్ డిటెక్షన్, కస్టమ్ డిటెక్షన్, ఇంటెలిజెంట్ స్కానింగ్ వంటి ఫీచర్లను తమ సరికొత్త సాఫ్ట్ వేర్ అందిస్తుందని ఇన్నోవేజన్ సీఈవో అభిషేక్ గాగ్నేజా వివరించారు.