: రుణమాఫీ కారణంగా ఏపీ ప్రభుత్వంపై 30 వేల కోట్ల భారం
ఆంధ్రప్రదేశ్ లో రుణమాఫీపై విధివిధానాలు రూపొందించేందుకు నియమించిన కోటయ్య కమిటీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మధ్యంతర నివేదిక సమర్పించింది. రుణమాఫీ చేస్తే ప్రభుత్వంపై పడే భారం, రుణమాఫీ విధివిధానాలు, అమలుకు ఉన్న అడ్డంకులు, ప్రత్యామ్నాయ మార్గాలపై పలు సూచనలు చేసింది. ప్రభుత్వంపై పడే భారాన్ని మూడు రకాలుగా విభజించింది.
రుణమాఫీ కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై 25 వేల కోట్ల రూపాయల భారం పడుతుందని నివేదికలో పేర్కొంది. బంగారం రుణాల మాఫీ కారణంగా మరో 5 వేల కోట్ల రూపాయల అదనపు భారం ప్రభుత్వంపై పడుతుందని కమిటీ అంచనా వేసింది. దీనికి బాండ్ల జారీ, రీషెడ్యూల్ లాంటి ప్రత్యామ్నాయాలను కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది.