: భారతీయులను వదిలేయండి: ఇరాక్ తీవ్రవాదులకు ఆమ్నెస్టీ విజ్ఞప్తి


భారతీయులు సహా బందీలందర్నీ వదిలేయాలని ఇరాక్ తీవ్రవాదులకు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ విజ్ఞప్తి చేసింది. ఇరాక్ లోని నజాఫ్ ప్రాంతంలో వందలాది భారతీయ భవన నిర్మాణ కార్మికులు చిక్కుకుపోయారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది. భవన నిర్మాణ కార్మికులుగా పని చేసే వీరంతా యజమానులకు పాస్ పోర్టులు అప్పగించారని, ఇప్పుడా యజమానులు పాస్ పోర్టులు తిరిగి ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని, మరోవైపు ఐదు నెలలుగా వీరికి జీతభత్యాలు ఇవ్వడంలేదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వెల్లడించింది. మరోపక్క భారత ప్రభుత్వం మాత్రం ఇరాక్ లో చిక్కుకున్న భారతీయుల్ని స్వదేశానికి చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతోంది.

  • Loading...

More Telugu News