: ప్రతి నీటి చుక్కను వినియోగించుకుంటాం: ఉమ


విజయవాడలో నీటిపారుదల మంత్రిత్వ శాఖ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి దేవినేని ఉమ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ను సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రతి నీటి చుక్కను వినియోగించుకుంటామని అన్నారు. ఆయకట్టు చివరి ప్రాంతానికి సైతం నీరందేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రోజుకు 18 గంటలు శ్రమిస్తున్నారని కొనియాడారు. మంత్రిగా రాష్ట్ర పురోగతి కోసం పాటుపడతానని అన్నారు.

  • Loading...

More Telugu News