: హైదరాబాదులో 'విశ్వరూపం' సక్సెస్ మీట్


నటుడు కమల్ హాసన్ తాజా సినిమా  'విశ్వరూపం' విజయవంతం కావడంతో హైదరాబాద్ తాజ్ బంజారా హోటలులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కమల హాసన్ తో బాటు టాలీవుడ్ తారలు అక్కినేని నాగార్జున, ప్రభాస్, నిర్మాత డి. రామానాయుడు, దర్శకులు దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, కె. విశ్వనాధ్, రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ దితరులు హాజరయ్యారు. 

తమిళనాడు లో ఈ సినిమా అద్భుతమైన వసూళ్లు సాధిస్తోందని నాగార్జున అన్నారు. విశ్వరూపం హలీవుడ్ సినిమాలకు దీటుగా కమల్ తీశారని నాగార్జున అన్నారు. సినిమా విభాగాలపై కమల్ మేధస్సు అమోఘమని దర్శకులు కె. విశ్వనాధ్ అన్నారు. కమల్ మరిన్ని మంచి చిత్రాలు అందించాలని కె. విశ్వనాధ్ అన్నారు. 

  • Loading...

More Telugu News