: టీవీ యాంకర్ ను వంచించిన వ్యక్తి అరెస్ట్
తనతో నాలుగేళ్ళు సహజీవనం చేసి ఇప్పుడు ముఖం చాటేసిన వంచకుడిని ఓ టీవీ యాంకర్ పోలీసులకు పట్టించింది. కొన్ని రోజుల క్రితం ఆమె హైదరాబాదు పోలీసులకు అతడిపై ఫిర్యాదు చేసింది. తనను మోసం చేసి మరో యువతితో పెళ్ళికి సిద్ధమయ్యాడని తన ఫిర్యాదులో తెలిపింది. ఈ క్రమంలో పోలీసుల సాయంతో ఆమె వైజాగ్ వెళ్ళింది. అక్కడ పెళ్ళిమంటపంలో హఠాత్తుగా టీవీ యాంకర్ పోలీసులతో ప్రత్యక్షమవడంతో ఆ వ్యక్తి పరారయ్యాడు. అయితే, పోలీసులు ఎట్టకేలకు అతడిని అరెస్టు చేశారు.
అతడి పేరు సార మల్లికార్జునరావు. స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి ప్రాంతం. బీటెక్ పూర్తి చేసిన అతడు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్ళి చేసుకుంటానని నమ్మబలికి టీవీ యాంకర్ తో ఇన్నాళ్ళూ సహజీవనం చేశాడు. కాగా, పోలీసులు అతడిని అరెస్టు చేసి, హైదరాబాద్ తరలించారు.