: అసోంలో ప్రకాశం జిల్లా ఇంజనీర్ అపహరణ


అసోంలో బోడో తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ప్రకాశం జిల్లాకు చెందిన నాగమల్లేశ్వరరావు అనే ఇంజనీర్ ను అపహరించారు. నాగమల్లేశ్వరరావు వశిష్ఠ కన్ స్ట్రక్షన్స్ లో విధులు నిర్వరిస్తున్నారు. ఈనెల 17న తీవ్రవాదులు ఆయనను కిడ్నాప్ చేశారు. రూ. 10 లక్షలు ఇవ్వాలని కిడ్నాపర్లు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో ఆయన కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. నాగమల్లేశ్వరావు స్వస్థలం ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం కేవీపాలెం గ్రామం.

  • Loading...

More Telugu News