: రైల్వే ధరలు పెరిగినా... ఆంధ్రప్రదేశ్ కు న్యాయం జరుగుతుంది: మురళీమోహన్
రైల్వే బడ్జెట్ లో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఈసారి రైల్వే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లనున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రైల్వే అవసరాలను కేంద్రానికి నివేదిస్తామని వెల్లడించారు. కృష్ణపట్నం, నిజాంపట్నం, కళింగపట్నం పోర్టులను కలుపుతూ రైల్వే మార్గం అవసరమని పేర్కొన్న ఆయన, అందుకు అవసరమైన రైల్వే మార్గాన్ని నిర్మించాలని కేంద్రాన్ని కోరతామని అన్నారు.