: మియాపూర్ లో టీడీపీ నేత హత్య
హైదరాబాద్ లోని మియాపూర్ న్యూహఫీజ్ పేట ప్రేమ్ నగర్ లో స్థానిక టీడీపీ నేత హత్యకు గురయ్యారు. ఇంటినుంచి బయటకు వెళ్లిన ఆయనపై అమాంతం దాడి చేసిన దుండగులు ఆయనను హత్య చేశారు. కాలనీ సమీపంలో ఆయన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.