: మోడీకి ఇష్టం లేకపోయినా పెంచాల్సి వచ్చింది: కిషన్ రెడ్డి


రైల్వే ఛార్జీలను పెంచడం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఇష్టం లేదని బీజేపీ తెలంగాణ అద్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రైల్వేల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గత్యంతరం లేని పరిస్థితుల్లో ఛార్జీలను పెంచాల్సి వచ్చిందని అన్నారు. సిమెంట్ ధరల పెంపు ఏకపక్షంగా జరిగిందని ఆరోపించిన ఆయన, పెరిగిన ధరను తగ్గించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూర్చొని విద్యుత్, నీటి పంపకాలపై చర్చించుకోవాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News