: రైతుబజార్లను పటిష్టం చేస్తాం: ప్రత్తిపాటి


రైతు బజార్లను పటిష్టం చేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రైతులు పట్టణాల్లోని రైతు బజార్లకు ఉత్పత్తులు తరలించేలా వాహనాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. రైతు బజార్లలో పండ్లను కూడా అమ్మేలా ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు. వ్యవసాయదారులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీకి టీడీపీ కట్టుబడి ఉందన్న ఆయన, అందుకు అవసరమయ్యే కసరత్తు చేస్తున్నామని అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రేపు కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News