: ఐపీఎల్ లో నేడు 'పంజాబ్-చెన్నై' పోరు
ఐపీఎల్ ఆరవ సీజన్ లో భాగంగా ఈ రోజు 'కింగ్స్ ఎలెవన్ పంజాబ్-చెన్నైసూపర్ కింగ్స్' జట్లు తలపడనున్నాయి. మొహాలీ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా, నిన్న రాత్రి జరిగిన పోరులో ఢిల్లీ డేర్ డెవిల్స్ పై ముంబయి ఇండియన్స్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ముంబయి 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఇలా 200 మార్కు స్కోరు దాటడం అనేది ఈ టోర్నీలో ఇదే తొలిసారి. ఇంతవరకు మూడు మ్యాచ్ లు ఆడి రెండు కైవసం చేసుకున్న ముంబయి పాయింట్ల పట్టికలో మొదటిస్థానంలో నిలిచింది.