: చవాన్ కానీ షిండే కానీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారు: శరద్ పవార్


కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చనుందని ఎన్సీపీ నేత శరద్ పవార్ తెలిపారు. ముంబైలో ఆయన మాట్లాడుతూ, మహారాష్ట్రకు అశోక్ చవాన్ కానీ, సుశీల్ కుమార్ షిండే కానీ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. మిజోరం, అసోం రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా కాంగ్రెస్ పార్టీ మార్చనుందని ఆయన వెల్లడించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహన్ కు, ఎన్సీపీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా ముఖ్యమంత్రిని మార్చాలని శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ డిమాండ్ చేస్తున్నారు. యూపీఏ మిత్రపక్షాల్లో ఎన్సీపీ ఒకటి. లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన కాంగ్రెస్ పార్టీ పృథ్వీరాజ్ చౌహాన్ పై గుర్రగా ఉంది. దీంతో సీఎంను మార్చాలని ఎన్సీపీ ఒత్తిడి పెంచుతోంది. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో వేచిచూడాలి!

  • Loading...

More Telugu News