: న్యూయార్క్ తరహాలో గ్రేటర్ హైదరాబాద్ పోలీస్ వ్యవస్థ: కేసీఆర్


గ్రేటర్ హైదరాబాద్ పోలీసు వ్యవస్థను న్యూయార్క్ తరహాలో మార్చేద్దామని పోలీసు ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. గ్రేటర్ పరిధిలోని పోలీసులకు న్యూయార్క్ పోలీస్ తరహాలో డ్రెస్ కోడ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ రోజు సచివాలయంలో హోం మంత్రి నాయిని, డీజీపీ, సిటీ కమిషనర్ లతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీస్ వ్యవస్థలో ఒకే రకమైన కంట్రోలింగ్ సిస్టం ఉండాలని చెప్పారు. పోలీస్ డిపార్ట్ మెంటుకు 1650 ఇన్నోవాలు, 1600 బైకులు కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీచేశారు. దీనికోసం రూ. 300 కోట్లు కేటాయిస్తామని కేసీఆర్ చెప్పారు. ఈ మార్పులకు 45 రోజుల గడువు విధించారు.

  • Loading...

More Telugu News