: నా కూతురు గురించి తెలియదు: సైఫ్ అలీఖాన్


తన కుమార్తె సినీ రంగ ప్రవేశం గురించి తనకు తెలియదని బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ తెలిపాడు. హమ్ షకల్స్ సినిమా ప్రమోషన్ లో ఆయన మాట్లాడుతూ, మీడియాలో ప్రసారమవుతున్నట్టు తన కుమార్తెకు సినిమాల్లో నటించే ఆసక్తి ఉందో లేదో తనకు తెలియదని అన్నాడు. తన పిల్లలకు అవసరమైన స్వేచ్ఛ ఇచ్చానని అన్న ఆయన, వారి ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా ఏదీ చేయనని చెప్పాడు. తన కుమార్తె సారాకు సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉండేదని, అయితే ఆమె ప్రస్తుతానికి కొలంబియా యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తోందని తెలిపాడు. డిగ్రీ సర్టిఫికేట్ చేతికి వచ్చిన తరువాత తనకేది ఇష్టమైతే అదే చేయొచ్చని సైఫ్ స్పష్టం చేశాడు. ప్రభుత్వ ఏజెన్సీలో పనిచేయాలని సారా భావిస్తున్నట్టు తనకు తెలుసని ఆయన చెప్పాడు.

  • Loading...

More Telugu News