: ఆదిలాబాద్ జిల్లాలో సర్పంచ్ దారుణ హత్య
ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ సర్పంచ్ మంద రవిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే నరికి చంపారు. అనంతరం ఘటనా స్థలం నుంచి పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. సర్పంచ్ హత్యతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.