: 'విద్యార్థే కాదు... విద్యార్థి తండ్రి కూడా తెలంగాణలోనే పుట్టి ఉండాలి'
ఫీజు రీయింబర్స్ మెంట్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించే పనిలో ఉన్నట్టు సమాచారం. కేవలం విద్యార్థి మాత్రమే తెలంగాణలో పుడితే సరిపోదని... విద్యార్థి తండ్రి కూడా తెలంగాణలోనే పుట్టాలనే నిబంధనను పెట్టే అవకాశాలున్నట్టు సమాచారం. ఈ నిబంధన ఉంటేనే తెలంగాణ విద్యార్థులకు పూర్తిగా న్యాయం చేయగలమనే ఆలోచనలో టీ.ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.