: రైలు ఛార్జీల పెంపుపై దేశవ్యాప్తంగా నిరసనలు
బీజేపీ సర్కారు తీసుకున్న రైల్వే ఛార్జీల పెంపు నిర్ణయం దేశవ్యాప్త నిరసనలకు దారితీసింది. దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. పోలీసులు నిరసనకారులను చెదరగొట్టేందుకు వాటర్ క్యానన్లు ఉపయోగించారు. రైల్వే ఛార్జీల పెంపుపై కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ స్పందిస్తూ... మంచి రోజులు ముందున్నాయని ఎన్నికల ముందు చెప్పిన బీజేపీ, గెలిచిన తర్వాత చేదు గుళికలు తినిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఇక, వారణాసి, అలహాబాద్ నగరాల్లో సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.