: సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు వచ్చింది రికార్డింగ్ డ్యాన్సులు, ఇడ్లీ సాంబారే: కేసీఆర్


ముఖ్యమంత్రి అయినా తాను పాత కేసీఆర్ నేనని... తనకు కొత్తగా కొమ్ములేమీ రాలేదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. పార్టీ ఆఫీస్ లో పాతవారే కనిపిస్తున్నారని... సచివాలయంలో మాత్రం కొత్తవారు కనిపిస్తున్నారని చెప్పారు. మంత్రి పదవి రానందుకే టీఆర్ఎస్ పార్టీని స్థాపించానని ఇప్పటికీ కొందరు తనపై విమర్శలు గుప్పిస్తున్నారని... ఈ ఆరోపణలు కాలం చెల్లిన మెడిసిన్ వంటివని ఎద్దేవా చేశారు. పార్టీకోసం పనిచేసిన వారందరికీ పదవులను కట్టబెడతామని హామీ ఇచ్చారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు వచ్చింది రికార్డింగ్ డాన్సులు, ఇడ్లీ సాంబారే అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

  • Loading...

More Telugu News