: హైదరాబాదు ఎంఎస్ వోలపై కేబుల్ ఆపరేటర్ల ఫిర్యాదు


ఎంఎస్ వోలు ప్రజలకు అవసరమైన చానళ్ళను నిలిపివేసి తమకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారని హైదరాబాదులోని కేబుల్ ఆపరేటర్లు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు మల్కాజ్ గిరి డీసీపీకి ఫిర్యాదు చేశారు. ఎంఎస్ వోలపై చర్యలు తీసుకోవాలని వారు తమ ఫిర్యాదులో డీసీపీని కోరారు. తెలంగాణ ఎమ్మెల్యేలపై సెటైర్లు వేసిందన్న ఆరోపణలపై టీవీ9 చానల్ విషయంలో ఇటీవల దుమారం రేగిన సంగతి తెలిసిందే. దీంతో, గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలోనూ, తెలంగాణ జిల్లాలలోనూ టీవీ9, ఏబీఎన్ చానళ్ళ ప్రసారాలు నిలిచిపోయాయి.

  • Loading...

More Telugu News