: భార్య పాలిట యముడిలా మారిన భర్త
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని గుమ్మళ్ళదొడ్డి గ్రామంలో భార్య పాలిట యముడయ్యాడు ఆమె భర్త. తాళికట్టిన భర్తే కుటుంబ కలహాల నేపథ్యంలో... భార్యపై యాసిడ్ పోశాడు. దాంతో తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు అసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఆమెను జిల్లా ఎస్పీ పరామర్శించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.