: రుణమాఫీకి ఆర్బీఐ అనుమతి కావాలా?... మేనిఫెస్టోకి అనుమతి ఉందా?: శైలజానాథ్


రైతు రుణమాఫీపై ఆర్బీఐ అభ్యంతరం చెబుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించడం సరికాదని మాజీ మంత్రి శైలజానాథ్ అన్నారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీల అమలుపై టీడీపీ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని అన్నారు. రుణమాఫీ చేయకుండా కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారని ఆయన ప్రశ్నించారు. రుణమాఫీపై ఆర్బీఐ అభ్యంతరం చెబుతోందని అంటున్న ముఖ్యమంత్రి... ఎవరి అనుమతి తీసుకుని మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ అంశాన్ని పేర్కొన్నారని ఆయన నిలదీశారు.

మేనిఫెస్టోలో పెట్టేందుకు ఆర్బీఐ అనుమతి ఇచ్చిందా? అని ఆయన అడిగారు. రాష్ట్ర రాజధాని రాయలసీమలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమలో భూమి లభ్యత ఉన్న కారణంగా ఐఐటీ, ఎయిమ్స్, హైకోర్టు వంటి వాటిని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News