: అక్టోబర్ లో యాపిల్ ఐవాచ్


యాపిల్ కంపెనీ నుంచి విడుదలవుతోందంటూ ప్రచారంలో ఉన్న ఐవాచ్ ఈ అక్టోబర్ నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విభిన్నరీతి, పరిమాణాల్లో ఉన్న ఐవాచ్ లు మార్కెట్ ను ముంచెత్తనున్నట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. తైవాన్ కు చెందిన క్వాంటా ఐవాచ్ ల ఉత్పత్తిని జులై నుంచి ప్రారంభించనున్నట్లు కంపెనీ వర్గాలను ఊటంకిస్తూ రాయిటర్స్ వార్తాసంస్థ వెల్లడించింది. తొలివిడతగా 5 కోట్ల ఐవాచ్ లను ఉత్పత్తి చేయాలని యాపిల్ ప్రణాళికలు రూపొందించుకున్నట్లు సమాచారం. ఈ వాచ్ లో వాడే వివిధ పరికరాలను వివిధ కంపెనీల నుంచి యాపిల్ సేకరిస్తోంది. వాచ్ డిస్ ప్లేను ఎల్ జీ, వినియోగదారుడి పల్స్ ఆధారంగా పనిచేసే సెన్సర్ ను సింగపూర్ కు చెందిన హెప్టాగాన్ ల నుంచి దిగుమతి చేసుకుంటోంది.

  • Loading...

More Telugu News