: ఏడుగురు సభ్యులతో బీఏసీ ఏర్పాటు


బీఏసీ సమావేశంలో పాల్గొనడానికి ఏడుగురు సభ్యులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీనికి సంబంధించి స్పీకర్ కార్యాలయంలో చర్చ జరిగింది. ఈ సమావేశంలో బీఏసీలో ఏడు మంది సభ్యులుండాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. సమావేశంలో టీడీపీ 4, వైకాపా 2, బీజేపీ నుంచి ఒక్కరికి చోటు కల్పించారు. టీడీపీ నుంచి సీఎం చంద్రబాబు, దేవినేని ఉమ, కేఈ కృష్ణమూర్తి, కాల్వ శ్రీనివాసులు బీఏసీకి హాజరవుతారు. ప్రత్యేక ఆహ్వానితుడిగా యనమలకు కూడా అవకాశం కల్పించారు. అయితే నలుగురు వైకాపా సభ్యులకు అవకాశం కల్పించాలని ఆ పార్టీ అధినేత జగన్ కోరినప్పటికీ... ఆ పార్టీ నుంచి ఇద్దరికే అవకాశం దక్కింది. నవోదయ పార్టీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా తనకు అవకాశం కల్పించాలని కోరారు. అయితే ఇతనికి అవకాశం దక్కలేదు.

  • Loading...

More Telugu News