: పోలీసులు, ఎర్రచందనం స్మగ్లర్ల మధ్య కాల్పులు... ఓ స్మగ్లర్ మృతి
కడప జిల్లా రైల్వే కోడూరు మండలం కుక్కలదొడ్డి అటవీప్రాంతంలో పోలీసులకు, ఎర్రచందనం స్మగ్లర్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు స్మగ్లర్లు తారసపడ్డారు. తమపై కాల్పులకు దిగిన స్మగ్లర్లపై పోలీసులు తడాఖా చూపించారు. పోలీసుల కాల్పుల్లో తమిళనాడుకు చెందిన ఓ కూలీ అక్కడికక్కడే మృతి చెందారు. కడప, చిత్తూరు జిల్లాల పోలీసులతో కలసి అటవీశాఖ సిబ్బంది కూంబింగ్ లో పాల్గొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎర్రచందనం స్మగ్లర్లను ఏరివేయాలని ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు, అటవీశాఖ సిబ్బంది కూంబింగ్ ను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు.