: ఫిఫా వరల్డ్ కప్ లో నేడు
ఫుట్ బాల్ ప్రపంచ కప్ లో భాగంగా నేడు మూడు మ్యాచ్ లు జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం, రాత్రి 9.30 గంటలకు జరిగే మ్యాచ్ లో అర్జెంటీనా, ఇరాన్ జట్లు తలపడతాయి. రాత్రి 12.30 గంటలకు జరిగే మ్యాచ్ లో జర్మనీని ఘనా జట్టు ఎదుర్కొంటుంది. తెల్లవారుజామున 3.30 గంటకు జరిగే మ్యాచ్ లో నైజీరియాతో బోస్నియా తలపడుతుంది. ఈ మ్యాచ్ లు సోనీ సిక్స్ చానల్ లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.