: ఇరాక్ కు భారీగా చేరుకుంటున్న డచ్ జిహాదీలు
ఇప్పటికే అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న ఇరాక్ కు మరో పెద్ద ముప్పు పొంచి ఉంది. స్థానిక తీవ్రవాదులతో చేయి కలిపి మరింత అలజడిని రేపేందుకు డచ్ (నెదర్లాండ్స్) జిహాదీలు భారీ సంఖ్యలో ఇరాక్ చేరుకుంటున్నారు. ఈ వివరాలను స్వయానా డచ్ మంత్రి వెల్లడించారు. గతంలో కూడా ఇరాక్, సిరియాలకు డచ్ జిహాదీలు తరలి వెళ్లి హింసకు పాల్పడ్డారు. వీరిలో కొంత మంది తిరిగి వచ్చారు కూడా.
సిరియాకు వెళ్లి తిరిగి వచ్చిన ఓ డచ్ జిహాదీ మాటల ప్రకారం... అతను సిరియాలోని బ్రస్సెల్స్ లో ఉన్న జెవిష్ మ్యూజియంపై దాడి చేసి ముగ్గుర్ని హతం చేశాడు. ఇదే విధంగా ఈ జిహదీలంతా స్థానిక టెర్రరిస్టులతో కలసి తమ కార్యకలాపాలను కొనసాగిస్తారు. అయితే, ప్రస్తుతం ఎంత మంది డచ్ జిహాదీలు ఇరాక్ వెళ్లారు, వెళుతున్నారనే విషయాన్ని మాత్రం సదరు మంత్రి వెల్లడించలేదు. జరుగుతున్న పరిణామాలపై ఆయన తన భయాందోళనలను వెలిబుచ్చారు. త్వరలోనే దీనికి సంబంధించి స్పష్టత ఇస్తామని చెప్పారు.