: ఏపీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడనుంది: గవర్నర్
విభజన అనంతరం ఏపీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడనుందని గవర్నర్ నరసింహన్ హెచ్చరించారు. ప్రస్తుతం ఏపీకి రూ.15 వేల కోట్ల ఆర్థిక లోటు ఉందని ప్రకటించారు. జాగ్రత్తగా వ్యవహరించకపోతే ప్రతికూల ప్రభావం తప్పదని అప్రమత్తం చేశారు. రెవెన్యూ లోటు భర్తీ చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరతామని తెలిపారు.