: వేగంగా వ్యాపించే పురుషుల ప్రొస్టేట్‌ క్యాన్సర్‌


పురుషులకు వారసత్వంగా ముందుతరాలనుంచి వచ్చే ఒకరకమైన ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ చాలా ప్రమాదకరమైనదిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ తరహా క్యాన్సర్‌ జన్యుపరంగా సంక్రమించి చాలా వేగంగా విస్తరిస్తుందని గమనించారు. బీఆర్‌సీఏ 2 అనే జీన్‌ పురుషుల్లో వారసత్వంగా వస్తుంది. దీంతో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ ప్రమాదం ఉంటుంది. అలాంటి సమయాల్లో అబ్జర్వేషన్‌ లో పెట్టకుండా, వెంటనే ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుందని డాక్టర్లు తేల్చారు.

లండన్‌లోని ఇన్స్‌టిట్యూట్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ రీసెర్చి రాయల్‌ మార్సడెస్‌ నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ సంస్థ పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. బీఆర్‌సీఏ 2 జన్యువు వల్ల వచ్చే క్యాన్సర్లు మిగిలిన వాటికంటె డేంజరస్‌ అని ప్రొఫెసర్‌ రాస్‌ ఈలెన్‌ అంటున్నారు.

  • Loading...

More Telugu News