: నిన్నటి వరకు ఆమ్ ఆద్మీ అన్నారు...చావబాదారు: మనీష్ తివారీ
నిన్నటి వరకూ ఆమ్ ఆద్మీ అంటూ... దేశ ప్రజలకు అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ ఆశల పల్లకిలో కూర్చోబెట్టిన ఎన్డీయే ప్రభుత్వం దేశప్రజలను చావబాదిందని కేంద్ర మాజీ మంత్రి మనీష్ తివారీ అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, దేశ ప్రజలంతా బీజేపీ ఏం చేస్తుందా? అని ఎదురు చూస్తున్న తరుణంలో రైల్వే ఛార్జీలను భారీగా పెంచి వారి నెత్తిన బాంబు వేసిందని అన్నారు.
దేశ ప్రజలకు ఎన్డీయే తొలి బహుమతి ఇలా అందించిందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్డీయే ప్రభుత్వం దేశ ప్రజలపై ముందుముందు మరింత భారం వేయనుందని ఆయన తెలిపారు. ప్రజలకు ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామో తెలిసే రోజు రానుందని ఆయన సూచించారు.