: చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన కేంద్ర మంత్రి
కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. తన రాజ్యసభ అభ్యర్థిత్వానికి మద్దతిచ్చినందుకు ఆమె చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఖాళీ అయిన నేదురుమల్లి జనార్థనరెడ్డి స్థానం నుంచి నిలబడుతున్న ఆమెను టీడీపీ బలపరుస్తోంది.