: సుష్మాతో మోడీ ఉన్నత స్థాయి భేటీ


ఇరాక్ లో భారతీయుల సంరక్షణ అంశంపై చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోడీ విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తో సమావేశమయ్యారు. ఇరాక్ లో అపహరణకు గురైన వారు క్షేమంగానే ఉన్నారని, వారిని తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టనున్నామని విదేశాంగ శాఖ అధికారులు ప్రధానికి తెలిపారు. విమాన టికెట్లు భరించే స్తోమత లేని వారిని ఆదుకుంటామని, ఇరాక్ లోని భారత రాయబార కార్యాలయంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని ప్రధానికి అధికారులు చెప్పారు. భారతీయులకు నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రధాని వారికి సూచించారు.

  • Loading...

More Telugu News