: 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ అందిస్తాం: అయ్యన్న పాత్రుడు


ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఇంటికి 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ అందజేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం తొలి విడత 5,200 గ్రామాల్లో అమలు చేస్తామని అన్నారు. అక్టోబర్ నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడు సురక్షిత మంచి నీరు తాగాలనే సదుద్దేశంతో తక్కువ ధరకే శుద్ధమైన నీరు అందిస్తున్నామని ఆయన చెప్పారు.

దీని విధివిధానాలపై ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ పధకంలో గ్రామ సర్పంచ్, మండల పరిషత్ సభ్యులు భాగస్వాములుగా ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News