: ఏపీ, తెలంగాణ మధ్య 7 చెక్ పోస్టుల ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య 7 చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తూ వాణిజ్య పన్నుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వాటి వివరాలు. మహబూబ్ నగర్ జిల్లా తుంగభద్ర వంతెన వద్ద ఓ చెక్ పోస్టు, నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ సమీపంలో మరో చెక్ పోస్టు, నల్గొండ జిల్లా విష్ణుపురం సమీపంలో ఒక చెక్ పోస్టు, నల్గొండ జిల్లా కోదాడ సమీపంలో ఇంకో చెక్ పోస్టు, ఖమ్మం జిల్లాలోని మధిర సమీపంలో ఒకటి. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట సమీపంలో మరో చెక్ పోస్టు, ఖమ్మం జిల్లా పాల్వంచ సమీపంలో ఇంకొకటి ఏర్పాటు కానున్నాయి.