: రాంగోపాల్ వర్మను దెయ్యం పూనింది


ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మను దెయ్యం పూనినట్టుంది. వరుసగా విఫలమైనా దెయ్యాలను వర్మ వదలడం లేదు. వరుసగా దెయ్యం సినిమాలు చేసి, అవి భయపెట్టకపోవడంతో కలెక్షన్లు లేకుండా ప్రేక్షకులు వర్మ తలను బొప్పికట్టేలా చేశారు. అయినప్పటికీ ఆయనకు దెయ్యాలతో సినీ అభిమానులను భయపెట్టాలనే కోరిక చావలేదు. తాజాగా వర్మకు ఓ వింత ఆలోచన వచ్చింది.

ఒసామా బిన్ లాడెన్ దెయ్యంగా మారి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను పట్టేస్తే... మరణించిన ఆల్ ఖైదా తీవ్రవాదులు వైట్ హౌస్ ను ముట్టడించే కథ ఎలా ఉంటుందని ట్విట్టర్ లో పేర్కొన్నాడు. దీంతో వర్మ దెయ్యాల్ని ఇప్పట్లో వదిలేలా లేడంటూ సోషల్ నెట్ వర్క్ హోరెత్తుతోంది.

  • Loading...

More Telugu News