: కొత్తొక వింత.. పాతొక రోత... చంద్రయానమైనా అంతే!
ఒకసారి చంద్రుడిమీదకు వెళ్లి వచ్చేసిన తర్వాత మళ్లీ మళ్లీ అక్కడికే వెళ్లడానికి పెద్ద మోజేం ఉంటుంది. అంతగా వెళ్లగలిగితే గనుక.. మరో గ్రహాన్ని ఎంచుకోవచ్చునని అనిపిస్తుంది. గ్రహాల మీదకు మనుషుల్ని పంపే విషయంలో సాగే పరిశోధనల విషయంలో కూడా.. ఈ కొత్త ఒక వింత, పాతొక రోత సిద్ధాంతం.. అచ్చంగా అమలవుతుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నిరూపిస్తోంది.
చంద్రుడిమీదకు మళ్లీ మానవయాత్ర సాగించే ఉద్దేశం ఇప్పట్లో లేదని నాసా ప్రకటించింది. సమీప భవిష్యత్తులో ఓ గ్రహశకలం లేదా అంగారకుడి మీదకు మనిషిని పంపే ప్రయోగాల మీద మాత్రమే దృష్టి పెడుతున్నట్లు అంతరిక్ష పరిశోధన సంస్థ అధినేత చార్లెస్ బోల్డెన్ వెల్లడించారు. ఒబామా గతంలో మాట్లాడుతూ 2025లోగా.. ఓ గ్రహం మీదికి మానవయాత్ర సాగుతుందని ప్రకటించారు. అలాంటి ప్రయోగం మీదనే ప్రస్తుతం తమ దృష్టి ఉందని బోల్డెన్ అంటున్నారు.