: డిప్యూటీ స్పీకర్ పదవికి మండలి బుద్ధప్రసాద్ నామినేషన్


మండలి బుద్ధప్రసాద్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఉదయం ఉపసభాపతి పదవికి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పదవికి గొల్లపల్లి సూర్యారావు పేరు దాదాపు ఖరారైనట్టు ఉదయం వార్తలు వెలువడ్డాయి. అయితే, బుద్ధప్రసాద్ నామినేషన్ తో అవన్నీ ఊహాగానాలేనని తేలిపోయింది. ఈ నెల 23న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది.

  • Loading...

More Telugu News