: పాపం... ఆ 40 మంది మోసపోయినవారే!


ఇరాక్ లో చిక్కుకున్న 40 మంది యువకులు ఏజెంట్ల చేతిలో మోసపోయి... అక్రమంగా అక్కడికి చేరుకున్నవారేనని తెలుస్తోంది. పంజాబ్ లోని పలు పట్టణాల్లోని పలువురు ఏజెంట్లు నిరుద్యోగ యువతను మభ్యపెట్టి దుబాయ్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వారిని టూరిస్టు వీసాపై దుబాయ్ పంపిస్తున్నారు. అక్కడ పని ప్రారంభం కాలేదనో, కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉందనో చెప్పి కొన్ని రోజులు ఖాళీగా ఉంచుతున్నారు.

వీరు తీసుకెళ్లిన డబ్బులు, సామగ్రి అయిపోయిన తరువాత ఇక్కడ ఇలాగే ఉంటుందని, ఇరాక్ లో ఆయితే వెంటనే పని దొరుకుతుందని చెబుతున్నారు. దీంతో పని లేక, డబ్బుల్లేక తీవ్ర నిరాశ, నిస్పృహకు లోనైన యువకులు ఇరాక్ వెళ్లిపోతున్నారని సమాచారం. ఇప్పుడు ఇరాక్ లో తీవ్రవాదుల చేతుల్లో బందీలుగా ఉన్న 40 మంది భారతీయులు అలాంటి వారేనని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News