: పదవులు వదిలేయడం సంప్రదాయం... అది కూడా చెప్పాలా?: వెంకయ్యనాయుడు
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారినప్పుడు ఆయా ప్రభుత్వాలు నియమించిన నామినేటెడ్ సభ్యులు స్వచ్ఛందంగా రాజీనామా చేయడం సంప్రదాయమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. బెంగళూరులో ఆయన మాట్లాడుతూ, యూపీఏ నామినేటెడ్ సభ్యులు తమ పదవులను వదులుకోవాలని సూచించారు. నామినేటెడ్ పదవుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ వారిని రాజీనామాలు కోరి ఇబ్బంది పెట్టడం లేదని, వారే స్వచ్ఛందంగా పదవులు వదులుకుంటే రాజీనామాలు కోరాల్సిన అవసరం ఉండేది కాదుకదా? అని ఆయన అభిప్రాయపడ్డారు.