: హిందీని ఎవరిపైనా బలవంతంగా రుద్దం: వెంకయ్య
ప్రభుత్వాధికారులు సోషల్ మీడియాలో ఇకపై హిందీలోనే వ్యాఖ్యలు చేయాలన్న కేంద్ర హోం శాఖ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి వెంకయ్య నాయుడు రంగంలోకి దిగారు. హిందీని బలవంతంగా ఎవరిపైనా రుద్దబోమని స్పష్టం చేశారు. ఈ విషయంలో దుష్ప్రచారం జరిగిందని వివరణ ఇచ్చారు. ప్రాంతీయ భాషలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ప్రస్తుత ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు.