: పోలవరంపై నాయుళ్లిద్దరూ తప్పుదోవ పట్టిస్తున్నారు: పాల్వాయి
పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పోలవరం విషయంలో న్యాయం చేయాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి అన్ని వివరాలు తెలిపానని అన్నారు. సానుకూలంగా స్పందించిన మోడీ, తెలంగాణకు అన్యాయం జరగనీయమని చెప్పారని పాల్వాయి తెలిపారు. డిజైన్ మార్చితేనే పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ, గిరిజన శాఖ అనుమతులు లభిస్తాయని ఆయన వెల్లడించారు.