: డెవిల్స్ ను చితక్కొట్టిన ఇండియన్స్
ఢిల్లీ డేర్ డెవిల్స్ తో మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ పరుగుల వెల్లువెత్తించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ (48 బంతుల్లో 86: 14 ఫోర్లు, 2 సిక్సులు) మెరుపు బ్యాటింగ్ చేయడంతో తాజా సీజన్ లో తొలిసారి రెండొందల పైచిలుకు స్కోరు నమోదైంది. రోహిత్ శర్మ 74 పరుగులతో అజేయంగా నిలిచాడు. జట్టు స్కోరు 1 పరుగు వద్దే ఓపెనర్లు సచిన్, పాంటింగ్ వెనుదిరిగినా కార్తీక్, రోహిత్ చెలరేగడంతో ముంబయి భారీ స్కోరు సాధించింది.